సిద్ధు, వైష్ణవి కెమిస్ట్రీ పీక్!
By : Surendra Nalamati
Update: 2025-03-15 11:03 GMT
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‘. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా ‘బేబి‘ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుంది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్ తో అలరిస్తున్న ‘జాక్‘ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది.
హోలీ స్పెషల్ గా ‘కిస్‘ అంటూ సాగే సాంగ్ ప్రోమో రిలీజయ్యింది. ఈ ప్రోమోకే సోషల్ మీడియాలో సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతుంది. యూత్ సెన్సేషన్స్ సిద్ధు, వైష్ణవి మధ్య కిస్ కి సంబంధించిన పాట కావడంతో డిజిటల్ గా ఈ ప్రోమో, 2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కించుకుంది. ఫుల్ సాంగ్ మార్చి 17న ఉదయం 11.07 గంటలకు రాబోతుంది. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.