కబీర్‌ను వేటాడే టైమ్ వచ్చేసింది.. ఎన్టీఆర్!
బాలీవుడ్ యాక్షన్ స్పెక్టాకిల్ 'వార్' ఎంత బిగ్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'వార్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈసారి టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్‌ను షేక్ చేయబోతున్నాడు.;
బాలీవుడ్ యాక్షన్ స్పెక్టాకిల్ 'వార్' ఎంత బిగ్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'వార్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈసారి టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌తో స్క్రీన్‌ను షేక్ చేయబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆశక్తిగా ఎదురుచూస్తుండగానే, హీరో హృతిక్ రోషన్ ఒక కీలక ట్వీట్‌తో టెంపరేచర్ పెంచేశాడు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ సిద్ధంగా ఉంది అంటూ హింట్ ఇచ్చాడు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ కబీర్‌ను వేటాడే టైమ్ వచ్చేసింది అని చెప్పడం, ఫ్యాన్స్ ఊహలను మరింత ఊపందించింది.
ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ ఏదీ రాకపోవడంతో అందరి దృష్టి మే 20న రానున్న అప్‌డేట్ మీదే ఉంది. ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం.. డైరెక్ట్‌గా టీజర్‌తోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇది నిజమే అయితే, బాలీవుడ్-టాలీవుడ్ కలయికలో వస్తున్న ఈ భారీ సినిమాకు ఇదే మొదటి సాలిడ్ ప్రమోషన్ కానుంది.