‘పుష్ప 2‘ కోసం భారీగా తగ్గిన టికెట్ రేట్లు!
ఒకవైపు థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ సరికొత్తగా థియేటర్లలోకి అందుబాటులోకి వస్తోంది. రేపటి (జనవరి 17) నుంచి నుంచి 20 నిమిషాల కొత్త ఫుటేజితో ‘పుష్ప 2‘ థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా టికెట్స్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది టీమ్.
రేపటి నుంచి అందుబాటులోకి వచ్చే ‘పుష్ప 2‘ కోసం సింగిల్ స్క్రీన్స్ టికెట్ రేట్లను రూ.112 గా, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ టికెట్ రేట్లను రూ.150 గా ఖరారు చేశారు. అసలు ‘పుష్ప2‘ విడుదలైనప్పుడు ఈ సినిమాకోసం రెండు తెలుగు రాష్ట్రాలు అత్యధిక రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాయి. టికెట్ రేట్లు పెంపు కూడా ఈ సినిమా కొత్త కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టడంలో కీలక భూమిక పోషించాయి.
లేటెస్ట్ వెర్షన్ తో మళ్లీ థియేటర్లలో ‘పుష్ప 2‘ హంగామా కొనసాగబోతుంది. ఈ రీలోడెడ్ వెర్షన్ తో ఈ చిత్రం రెండు వేల కోట్లు వసూళ్లను సాధించి సరికొత్త కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి.