‘వీరమల్లు’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది !

By :  T70mm Team
Update: 2025-02-24 10:40 GMT

‘వీరమల్లు’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది !పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ పాటల పండగ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ పాడిన ‘మాట వినాలి‘ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు రెండో పాటగా ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. ఆస్కార్ విజేత కీరవాణి స్వరకల్పనలో మరో ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఆలపించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేశారు. 'కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో..' అంటూ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తో ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు అనసూయ, పూజిత పొన్నాడ వంటి వారు సందడి చేశారు. వచ్చేనెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొఘలాయిల కాలం నాటి కథాంశంతో .. పవర్ స్టార్ ను ఇంతకు ముందెన్నడూ చూపని రీతిలో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ‘బ్రో’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా ఇదే అవడంతో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News