'తండేల్' మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షక్లు సాధించిన చిత్రంగా 'తండేల్' నిలవబోతుంది. త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోనుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.;

By :  S D R
Update: 2025-02-10 05:00 GMT

యువ సామ్రాట్ నాగచైతన్య 'తండేల్' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకు రూ.62.37 కోట్లు వసూళ్లు సాధించింది. నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షక్లు సాధించిన చిత్రంగా 'తండేల్' నిలవబోతుంది. త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోనుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

మరోవైపు 'తండేల్' టీమ్ కు కింగ్ నాగార్జున ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. తన తనయుడు చైతన్యను అభినందిస్తూనే చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు నాగ్. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వేల్యూస్, సాయి పల్లవి నటన, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, చందు మొండేటి డైరెక్షన్ గురించి తన ట్వీట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కింగ్.

మొత్తంగా సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వెంకీమామ కలెక్షన్ల వర్షం కురిపిస్తే.. ఇప్పుడు మేనల్లుడు నాగచైతన్య ఫిబ్రవరి నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ ను దుల్లగొడుతున్నాడు. లాంగ్ రన్ లో 'తండేల్' ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News