మలయాళీ రీమేక్ తో తరుణ్ భాస్కర్

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్.. నటుడిగానూ విలక్షణతను చాటుతున్నాడు. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ హీరోగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.;

By :  S D R
Update: 2025-07-05 10:51 GMT


దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్.. నటుడిగానూ విలక్షణతను చాటుతున్నాడు. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ హీరోగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది.


లేటెస్ట్ గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అంబటి ఓంకార్ నాయుడు అనే వాన్ డ్రైవర్‌గా తరుణ్, కొండవీటి ప్రశాంతిగా ఈషా రెబ్బా కనిపించనున్నారు. ఈ చిత్రం మలయాళ హిట్ మూవీ ‘జయ జయ జయహే’కి అఫీషియల్ రీమేక్.

ఏఆర్ సజీవ్ ఈ చిత్రాన్ని ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, గోపరాజు విజయ్, శివన్నారాయణ, బిందు చంద్రమౌళి వంటి నటులు సహాయ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.



Tags:    

Similar News