‘రామాయణ‘కు ధీటుగా తారక్-త్రివిక్రమ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వార్ 2‘ ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతుంది.;

By :  S D R
Update: 2025-07-15 12:29 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వార్ 2‘ ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ ను సెట్స్ పై ఉంచాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది.

ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత తారక్ కిట్టీలో ఉన్న మరో చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమా మైథాలజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రస్తుతం త్రివిక్రమ్.. వెంకటేష్ తో ఓ కొత్త సినిమా ప్రారంభించనున్నట్లు తెలిపారు నాగవంశీ. ఇది 2026 ఫస్టాఫ్ లో రిలీజవుతుందని వెల్లడించిన నాగవంశీ.. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. తారక్-త్రివిక్రమ్ మూవీ 2026 ద్వితీయార్థంలో లాంఛనంగా ప్రారంభమవుతుందట.

ఈ సినిమా భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుందని వంశీ తెలిపారు. ‘ఇది కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం‘ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌లో రూపొందుతున్న ‘రామాయణ‘ గ్లింప్స్ చూసిన తర్వాత త్రివిక్రమ్, ‘మనది అంతకంటే గొప్పగా ఉండాలి‘ అని భావించారని వంశీ చెప్పారు.

ఎన్టీఆర్ ఈ సినిమాలో కార్తీకేయుని పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో రూపొందే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో ప్రత్యేకమైన అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. ఈ చిత్రం 2027 చివర్లో లేదా 2028 ప్రథమార్థంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News