తార తో వీరమల్లు డ్యాన్స్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకూ ఫుల్ లెన్త్ కాస్ట్యూమ్ డ్రామాలో చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో ఆ లోటు తీరబోతుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకూ ఫుల్ లెన్త్ కాస్ట్యూమ్ డ్రామాలో చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'తో ఆ లోటు తీరబోతుంది. 400 ఏళ్ల క్రితం నాటి కథతో రూపొందిన ఈ సినిమాలో 'వీరమల్లు'గా పవన్ కళ్యాణ్ చేసే యుద్ధాలు ఎంతో హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు మేకర్స్. అంతేకాదు.. 'వీరమల్లు' పాత్రలో పవర్ స్టార్ తన కామెడీ, రొమాన్స్ తోనూ అలరించబోతున్నాడు.
ఇప్పటికే 'హరిహర వీరమల్లు' నుంచి మూడు పాటలు విడుదల కాగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా 'తార తార' అంటూ సాగే స్పెషల్ నంబర్ ను రిలీజ్ చేశారు. కీరవాణి స్వరకల్పనలో శ్రీహర్ష ఈమని రాసిన ఈ పాటను లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ పాడారు. ఈ పాటలో నిధి అగర్వాల్ డ్యాన్స్ తో పాటు.. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జూన్ 12న 'హరిహర వీరమల్లు' విడుదలకు ముస్తాబవుతుంది.