'అఖండ 2'పై హైప్ పెంచేస్తోన్న తమన్!

'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ లో 'అఖండ 2' గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు సంగీత దర్శకుడు తమన్. 'అఖండ 2' ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి అదిరిపోయే హింట్ ఇచ్చాడు.;

By :  S D R
Update: 2025-01-23 01:33 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన 'అఖండ' చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది 'అఖండ 2'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న 'అఖండ 2' విడుదలకు ముస్తాబవుతోంది. 'అఖండ' చిత్రంలో అఘోర గెటప్ లో బాలయ్య అదరగొట్టాడు. ఇక ఆ పాత్రను ఓ లెవెల్ లో ఎలివేట్ చేయడంలో తమన్ నేపథ్య సంగీతం ఎంతగానో ప్రభావితం చూపించింది.

ఇప్పుడు 'అఖండ 2' అంతకు మించి ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చాడు తమన్. తాజాగా అనంతపురంలో జరిగిన 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ లో 'అఖండ 2' గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు సంగీత దర్శకుడు తమన్. 'అఖండ 2' ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ, ఇది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతోందని, ముందే అభిమానులు సిద్ధంగా ఉండాలని హింట్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు 'అఖండ 2'పై హైప్‌ను మరింత పెంచాయి.

'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేపథ్యంలో, ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. మరి ‘అఖండ 2 – తాండవం’ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News