సుహాస్ మరో కొత్త ప్రేమకథ!

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుహాస్ తాజాగా ‘ఓ భామా అయ్యో రామ’ అనే ప్రేమకథా చిత్రంతో రాబోతున్నాడు.;

By :  S D R
Update: 2025-03-24 09:27 GMT

వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుహాస్ తాజాగా ‘ఓ భామా అయ్యో రామ’ అనే ప్రేమకథా చిత్రంతో రాబోతున్నాడు. రామ్ గోదాల దర్శకత్వంలో, హరీశ్ నల్లా నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో మాళవిక మనోజ్ కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి టీజర్ రిలీజయ్యింది. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకథను కొత్త కోణంలో ఆవిష్కరించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. టీజర్ మొత్తంగా హిలేరియస్ గా ఆకట్టుకుంటుంది.

'నువ్వు నేను' అనిత, అలీ, బబ్లూ ఫృథ్వీ, రవీందర్ విజయ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, రధన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ వేసవిలో ‘ఓ భామా అయ్యో రామ’ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News