సుధీర్, సోనాక్షి ఎపిక్ బ్యాటిల్
నవ దళపతి సుధీర్ బాబు నుంచి రాబోతున్న డివోషనల్ మూవీ 'జటాధర'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రతినాయిక పాత్రలో కనిపించబోతుంది.;
నవ దళపతి సుధీర్ బాబు నుంచి రాబోతున్న డివోషనల్ మూవీ 'జటాధర'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రతినాయిక పాత్రలో కనిపించబోతుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా 'జటాధర' నుంచి టీజర్ రిలీజయ్యింది.
'షీ ఈజ్ ది డార్క్‌నెస్ క్రియేటెడ్ బై గ్రీడ్' అంటూ ప్రతినాయిక పాత్రలో సోనాక్షిని పరిచయం చేశారు. 'హీ వజ్ బార్న్ ఫ్రమ్ శాక్రిఫైస్' అంటూ సుధీర్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. అలా.. విట్ నెస్ ది ఎపిక్ బ్యాటిల్ ఆఫ్ గ్రీడ్ వర్సెస్ శాక్రిఫైస్ అంటూ ఈ మూవీ థీమ్ ను టీజర్ లో చెప్పకనే చెప్పేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
శాస్త్రీయ, పౌరాణిక అంశాల మేళవింపుతో 'జటాధర' సినిమాని తీసుకొస్తున్నారట. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణా అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది.