కనకవతిగా రుక్మిణి రాజసం

కన్నడ సెన్సేషనల్ హిట్ 'కాంతార'కు ప్రీక్వెల్ గా రాబోతున్న చిత్రం 'కాంతార: చాప్టర్ 1’. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.;

By :  S D R
Update: 2025-08-08 08:26 GMT

కన్నడ సెన్సేషనల్ హిట్ 'కాంతార'కు ప్రీక్వెల్ గా రాబోతున్న చిత్రం 'కాంతార: చాప్టర్ 1’. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన మేకింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమా కథా నేపథ్యం కదంబుల సామ్రాజ్య కాలంలో సాగుతుంది. తాజాగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని చిత్రబృందం కథానాయిక ‘కనకవతి’ పాత్రను పరిచయం చేసింది. ఈ పాత్రలో రుక్మిణి వసంత్ నటిస్తుంది. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి, ఈ సినిమాలో యువరాణి గా అలరించనుంది. 'కాంతార'కి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.



Tags:    

Similar News