శ్రీలీల ఔట్.. భాగ్యశ్రీ ఇన్!
అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు మురళీ కిషోర్ అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.;
అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు మురళీ కిషోర్ అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. రాయలసీమ నేపథ్యంలో పక్కా మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం పరువు హత్యల కథను ఆధారంగా తీసుకుని రూపొందుతోందని సమాచారం.
ఏప్రిల్ లో అఖిల్ బర్త్‌డే స్పెషల్ గా రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా శ్రీలీల ఎంపికైంది. 'లెనిన్' గ్లింప్స్ లో సైతం శ్రీలీల కనిపించింది. అయితే ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీలో అవకాశాలతో బిజీగా ఉన్న కారణంగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన భాగ్యశ్రీ బోర్సే ఈ ప్రాజెక్ట్‌లో శ్రీలీల స్థానాన్ని భర్తీ చేసినట్లు సమాచారం. ఇదే కాక ‘కింగ్డమ్’ సినిమాలో కూడా మొదట శ్రీలీలే హీరోయిన్గా ఉండాల్సింది. కానీ చివరికి ఆ ఛాన్స్ భాగ్యశ్రీకే దక్కింది. ఇలా రెండుసార్లు శ్రీలీల లక్‌ను భాగ్యశ్రీ లాగేసుకుందనే ప్రచారం నడుస్తోంది.
ఇక ‘లెనిన్’ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున, సుప్రియ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్‌కి తండ్రి పాత్రలో నాగార్జున నటించనున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.