సుహాస్ రొమాంటిక్ యాత్రలో కొత్త మలుపు
వైవిధ్యభరిత పాత్రల్లో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. లేటెస్ట్ గా సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.;
వైవిధ్యభరిత పాత్రల్లో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. లేటెస్ట్ గా సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో మలయాళ నటి మాళవిక మనోజ్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతుంది.
రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ సాంగ్ ‘ఎలాగుండే వాడ్నే ఎలా అయిపోయానే‘కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ పాటలో హీరో ప్రేమ కోసం ఎదుర్కొనే సమస్యలను హృద్యంగా చిత్రీకరించారు. శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా, రథన్ స్వరకల్పనలో శరత్ సంతోష్ ఈ పాటను ఆలపించాడు.