‘రావు బహదూర్‘గా సత్యదేవ్!

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తో వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న సినిమాకి ‘రావు బహదూర్‘ అనే టైటిల్ వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మంచి విజయాన్ని సాధించింది.;

By :  S D R
Update: 2025-04-22 09:14 GMT

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తో వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న సినిమాకి ‘రావు బహదూర్‘ అనే టైటిల్ వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మంచి విజయాన్ని సాధించింది. ఈనేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

జయాపజయాలతో సంబంధం లేకుండా పాత్రల ఎంపికలో తన ప్రత్యేకతను చాటుతూ సాగుతున్నాడు సత్యదేవ్. అతని గత చిత్రం ‘జీబ్రా‘ ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు.. ‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలను అందించిన వెంకటేష్ మహా.. సత్యదేవ్ తో ‘రావు బహదూర్‘ని పీరియాడిక్ టచ్ తో తెరకెక్కిస్తున్నాడట.

‘రావు బహదూర్‘ అనే బిరుదులను బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చేది. ఈ టైటిల్ తోనే ఈ మూవీ బ్రిటిష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే.. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News