ముంబైలో.. సల్మాన్ ఖాన్ టాక్సీ రైడింగ్ !

ఈ చిత్రం సెట్స్‌ నుంచి వచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.;

By :  K R K
Update: 2025-01-23 00:42 GMT

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ ‘సికందర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా.. ఈ చిత్రం సెట్స్‌ నుంచి వచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ అగ్రెసివ్ అవతార్‌లో కనిపించారు. ఆయన ఒక టాక్సీ నుంచి తన గ్యాంగ్‌తో దిగుతూ కనిపించారు. సల్మాన్ నీలం రంగు షర్ట్‌తో పాటు డెనిమ్ జీన్స్ ధరించి ఉన్నారు. టాక్సీ నుంచి దిగిన వెంటనే, ఆయన చుట్టూ అభిమానులు గుంపుగా ఉండే ప్రదేశంలోకి అడుగుపెట్టారు.

ఈ చిత్రానికి ముందు విడుదలైన టీజర్ యాక్షన్ సన్నివేశాలతో అభిమానులకు మాస్ ఫీస్ట్ అందించింది. అదిరిపోయే స్టంట్స్, హై-ఆక్టేన్ యాక్షన్‌తో సికందర్ ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. ఈ చిత్రం హీరో సల్మాన్ ఖాన్ ను నిర్మాత సాజిద్ నడియాద్‌వాలాను మరోసారి కలిపింది. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి ‘కిక్, ముజ్‌సే షాదీ కరోగీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు.

యాక్షన్ అండ్ అద్భుతమైన కథనం కలగలిసిన ‘సికందర్’ మూవీ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో సల్మాన్ క్రూరమైన, శక్తివంతమైన అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా 2025 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News