సెన్సేషనల్ హిట్‌గా 'సైయారా'
కంటెంట్ బలంగా ఉంటే చాలు స్టార్ పవర్ అవసరం లేకుండా వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టొచ్చు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంఫుల్ 'సైయారా'.;
కంటెంట్ బలంగా ఉంటే చాలు స్టార్ పవర్ అవసరం లేకుండా వందల కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టొచ్చు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంఫుల్ 'సైయారా'.చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది.
కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు పది రెట్లు లాభాలను ఇస్తూ పెద్ద సక్సెస్ స్టోరీగా నిలిచింది. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనంగా నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే 'ఛావా' రికార్డును బద్దలు కొట్టి రూ.94 కోట్ల వసూళ్లు సాధించింది.
మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, బాధ, నమ్మకం, విడిపోవడం, తిరిగి కలుసుకోవడం వంటి ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ భాగస్వామ్యంలో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లే సాధించింది. లాంగన్ రన్ లో 'సైయారా' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. సెప్టెంబ్ 12 నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలున్నాయి.