ఉత్తమ నటీనటులు షారుక్, విక్రాంత్, రాణి ముఖర్జీ

71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్) ఎంపికయ్యారు.;

By :  S D R
Update: 2025-08-01 13:40 GMT

71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటులుగా షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్) ఎంపికయ్యారు. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్‘ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో షారుక్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించగా.. నయనతార, దీపిక హీరోయిన్లుగా నటించారు.

విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘12th ఫెయిల్’ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఓ చిన్న గ్రామం నుంచి ఎలాంటి మద్దతు లేకుండానే, ఎన్నో కష్టాలు ఎదుర్కొని, చివరకు IPS అధికారిగా ఎదిగిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఈ సినిమా బేస్. విక్రాంత్ మెస్సీ ప్రధాన పాత్రలో నటించాడు. ఇక బెస్ట్ యాక్ట్రెస్ గా రాణీ ముఖర్జీ నిలిచింది. ‘ఛటర్జీ వర్సెస్ నార్వే‘ సినిమాలోని నటనకు గానూ ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీకి అవార్డు వరించింది.

Tags:    

Similar News