సుకుమార్ కూతురుకి నేషనల్ అవార్డ్

71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కూతురు సుకృతి వేణికి అవార్డు లభించింది. 'గాంధీ తాత చెట్టు' చిత్రంలోని నటనకు గానూ ఉత్తమ బాల నటిగా అవార్డును ప్రకటించింది జ్యూరీ.;

By :  S D R
Update: 2025-08-01 13:19 GMT

71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కూతురు సుకృతి వేణికి అవార్డు లభించింది. 'గాంధీ తాత చెట్టు' చిత్రంలోని నటనకు గానూ ఉత్తమ బాల నటిగా అవార్డును ప్రకటించింది జ్యూరీ.పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ‘గాంధీ తాత చెట్టు‘ ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించి అవార్డులు గెలుచుకుంది. అలాగే సుకృతి వేణికి ఆయా వేదికలలో బాల నటిగా అవార్డుల పంట పండింది.

‘గాంధీ తాత చెట్టు’ సినిమా గ్రామీణ నేపథ్యాన్ని హృద్యంగా ఆవిష్కరించిన చిత్రం. తాత పాత్రలో రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి), తన తాతగారి ఆచారాలను గౌరవించే మనవరాలుగా గాంధీ (సుకృతి వేణి) కలసి ఒక చెట్టును కాపాడటానికి చేసిన పోరాటం ప్రధాన కథాంశం. ఈ చిత్రం రైతులు, పెట్టుబడి దారుల మధ్య సంఘర్షణను సున్నితంగా చూపిస్తుంది.

Tags:    

Similar News