రణవీర్ సింగ్ స్థానంలో రణబీర్ కపూర్

Update: 2025-10-02 05:01 GMT

బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'బైజూ బావ్రా' పై దాదాపు రెండు దశాబ్దాలుగా స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఫైనల్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు బాలీవుడ్ మీడియా సమాచారం. ఇందులో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు.

రణబీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ మధ్య ఇటీవల ఒక ముఖ్యమైన మీటింగ్ జరిగింది. ఈ సినిమాను మొదట రణవీర్ సింగ్‌తో ప్లాన్ చేసినా, దర్శకుడు ఇప్పుడు రణబీర్ కపూర్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల రణబీర్ కపూర్ 43వ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు 'బైజూ బావ్రా' బహుమతిగా ఇచ్చాడని సమాచారం. 'బైజూ బావ్రా' ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

ఈ సినిమా 1955లో వచ్చిన 'బైజూ బావ్రా' చిత్రానికి రీమేక్. నిజానికి సంజయ్ లీలా భన్సాలీ, రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ గురించి సంవత్సరాలుగా చర్చలు జరిపారు. అయితే.. రణవీర్ సింగ్ స్థానంలో రణబీర్ కపూర్‌ను తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియవు. 'బైజూ బావ్రా' అనేది ఇద్దరు గాయకుల చుట్టూ తిరిగే ఒక సంగీత చిత్రం. సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్‌లతో కలిసి 'లవ్ అండ్ వార్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Tags:    

Similar News