రామ్ చరణ్ పక్కా జెంటిల్ మేన్ : జాన్వీ కపూర్

Update: 2025-10-02 04:56 GMT

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని.. నిజంగా ఆయన పక్కా జెంటల్‌మ్యాన్ అని పొగిడింది. ప్రెజెంట్ అక్టోబర్ 2న రిలీజ్ కానున్న తన హిందీ మూవీ ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ప్రమోషన్స్‌లో ఉన్న జాన్వీ, తన సెకండ్ తెలుగు ఫిల్మ్ ‘పెద్ది’ గురించి, అలాగే రామ్ చరణ్‌తో తన ఎక్స్‌పీరియన్స్‌ గురించి మాట్లాడింది.

"నాకు రామ్ సర్ అంటే చాలా ఇష్టం. ఆయన చాలా మంచి ఎనర్జీ ఉన్న జెంటిల్‌మ్యాన్. చాలా సిన్సియర్‌గా, శ్రద్ధగా పని చేస్తారు. అంత పెద్ద స్టార్ అయినా కూడా, సెట్‌కి ఒక స్టూడెంట్ లా వస్తారు. నాకు ఆ క్వాలిటీ బాగా నచ్చింది. ‘పెద్ది’ సెట్‌ కు మళ్లీ ఎప్పుడు వెళ్తానా అని వెయిట్ చేస్తున్నా.." అని జాన్వీ కపూర్ ఎగ్జైట్‌మెంట్ చూపించింది. ఈ సినిమాలో తన రోల్ చాలా యూనిక్గా ఉంటుందని ఆమె తెలిపింది.

"సెట్‌లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నాది చాలా ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ క్యారెక్టర్. బుచ్చి బాబు రూటెడ్ డైరెక్టర్. ఆయనకి క్లియర్ విజన్ ఉంది. నన్ను చాలా పుష్ చేస్తారు. నేను చేస్తున్న రోల్ రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. ఈ సెట్‌లో ఉండటం నా లక్ అని ఫీల్ అవుతున్నాను.." అని జాన్వీ కపూర్ చెప్పింది. జాన్వీ ఎన్టీఆర్ సరసన "దేవర"తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మార్చి 2026లో రిలీజ్ కాబోయే "పెద్ది"లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తోంది.

Tags:    

Similar News