'కింగ్డమ్' నుంచి 'రగిలే రగిలే'

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన 'కింగ్డమ్' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా 'రగిలే రగిలే' అంటూ పవర్‌ఫుల్ సాంగ్ రిలీజయ్యింది.;

By :  S D R
Update: 2025-07-30 00:45 GMT

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన 'కింగ్డమ్' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా 'రగిలే రగిలే' అంటూ పవర్‌ఫుల్ సాంగ్ రిలీజయ్యింది. అనిరుధ్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించాడు.

ఇలాంటి పవర్‌ఫుల్ సాంగ్స్ ను అనిరుధ్ స్వయంగా ఆలపిస్తుంటాడు. అయితే.. సిద్ధార్థ్ బస్రూర్ గొంతులో రూపొందిన ఈ సాంగ్ కొత్త టోన్ ను తీసుకొచ్చింది. హై ఎనర్జీ మాస్ బీట్‌లో సాగిన ఈ సాంగ్‌ సినిమాలో హీరోయిజాన్ని ఒక రేంజ్‌లో ఎలివేట్ చేస్తుందన్న తెలుస్తోంది.

తిరుపతి, హైదరాబాద్‌లలో నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లతో ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో పెరిగింది. ఈ మాస్ సాంగ్ తో హైప్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. మొత్తంగా.. భారీ అంచనాలతో రేపు వస్తోన్న 'కింగ్డమ్' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Full View


Tags:    

Similar News