పూరికి విలన్ దొరికేశాడు!
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ది పాతికేళ్ల ప్రస్థానం. జెట్ స్పీడులో సినిమాలను తెరకెక్కించే పూరి జగన్నాథ్.. స్టార్ హీరోలకు మోస్ట్ ఫేవరెట్.;
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ది పాతికేళ్ల ప్రస్థానం. జెట్ స్పీడులో సినిమాలను తెరకెక్కించే పూరి జగన్నాథ్.. స్టార్ హీరోలకు మోస్ట్ ఫేవరెట్. అయితే.. 'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్ ను ‘లైగర్, డబుల్ ఇస్మార్ట్’ తీవ్రంగా నిరాశపరిచాయి.
ఇప్పుడు మళ్లీ టాప్ లీగ్ లోకి వచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేశాడు. తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో టబు, రాధిక ఆప్టే కీలక పాత్రలలో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ రానున్న ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
లేటెస్ట్ గా ఈ మూవీలో విలన్ గా మాలీవుడ్ పవర్‌హౌజ్ ఫహాద్ ఫాజిల్ ను పరిశీలిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కథను ఫహాద్ కు వినిపించడం.. అతనికి నచ్చడం జరిగిందట. ఒకవేళ ఫహాద్ ఒప్పుకుంటే, ఈ సినిమాకి మరింత బజ్ వస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే పూరి 'బెగ్గర్'లో ఫహాద్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.