'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్‌కి సన్నాహాలు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ 'విశ్వంభర' నుంచి అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ వచ్చింది. అయితే టీజర్ కి మిక్స్‌డ్ రెస్పాన్స్ దక్కింది. టీజర్ లో వి.ఎఫ్.ఎక్స్ అంత ఎఫెక్టివ్ గా లేవనే కామెంట్స్ వినిపించాయి. దీంతో విజువల్ ఎఫెక్ట్స్ పై మరింతగా దృష్టి పెట్టిందట టీమ్.
మరోవైపు 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మూడు దశాబ్దాల తర్వాత చిరు-కీరవాణి కాంబోలో వస్తోన్న మూవీ ఇది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా రాముడుపై చిత్రీకరించిన గీతాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవితో పాటు మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ కూడా కనిపించనున్నాడు. మహాశివరాత్రి స్పెషల్ గా 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం 'విశ్వంభర' షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిరుకి జోడీగా త్రిష నటిస్తుండగా ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తుంది. త్వరలోనే 'విశ్వంభర' విడుదల తేదీపైనా క్లారిటీ రానుంది.