‘బోర్డర్ 2’ రిలీజ్ ఎప్పుడంటే.. !

ఈ సినిమా 2026 జనవరి 22న రిపబ్లిక్ డే వీకెండ్‌లో రిలీజ్ కానుంది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ‘బోర్డర్ 2’ టీమ్ మొదటి పోస్టర్‌ను విడుదల చేసింది.;

By :  K R K
Update: 2025-08-15 07:34 GMT

సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంఝ్, వరుణ్ ధావన్, ఆహన్ షెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ బాలీవుడ్ మూవీ ‘బోర్డర్ 2’. ఈ సినిమా 2026 జనవరి 22న రిపబ్లిక్ డే వీకెండ్‌లో రిలీజ్ కానుంది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ‘బోర్డర్ 2’ టీమ్ మొదటి పోస్టర్‌ను విడుదల చేసింది. సన్నీ డియోల్ సైనిక యూనిఫాంలో బజూకాను పట్టుకుని నిలబడిన ఈ పోస్టర్ దేశభక్తిని, తీవ్రమైన భావోద్వేగాలను రేకెత్తిస్తోంది.

ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ టీమ్ ఇలా రాసింది.. “హిందుస్తాన్ కోసం మళ్లీ పోరాడతాం. ‘బోర్డర్ 2’ జనవరి 22, 2026న థియేటర్లలో! స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు..”. పోస్టర్ విడుదలతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఒక అభిమాని కామెంట్ చేస్తూ, “గూస్‌బంప్స్! ఇది ఎపిక్ అవుతుంది” అని రాశాడు. మరొకరు, “చాలా బాగుంది, వెయిట్ చేయలేను” అన్నారు. “సన్నీ డియోల్ తన బెస్ట్‌లో ఉన్నాడు. పోస్టర్ అదిరిపోయింది” అని మరొకరు కామెంట్ చేశారు.

భూషణ్ కుమార్, జెపి దత్త నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేధా రాణా, మోనా సింగ్, సోనమ్ బాజ్వా కూడా నటిస్తున్నారు. భూషణ్ కుమార్ మాట్లాడుతూ, “బోర్డర్ కేవలం సినిమా కాదు, ప్రతి భారతీయుడికి ఒక భావోద్వేగం. ‘బోర్డర్ 2’తో ఆ వారసత్వాన్ని కొత్త తరానికి చేర్చాలనుకుంటున్నాం. కొత్త రిలీజ్ డేట్‌తో ప్రేక్షకులకు రిపబ్లిక్ డే వీకెండ్‌లో థియేటర్లలో సినిమాను ఎక్కువ కాలం ఆస్వాదించే అవకాశం లభిస్తుంది” అన్నారు. మరి ఈ సినిమా మొదటి భాగాన్ని మించే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి.


Tags:    

Similar News