ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజీ లైనప్ లో ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కతోందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజీ లైనప్ లో ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కతోందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.
అసలు ఈరోజు నుంచే ఎన్టీఆర్-నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉందట. అయితే కొన్ని అనివార్య కారణాల ఈ చిత్రం వచ్చే వారం నుంచి షూటింగ్ మొదలు పెట్టకోనుందట. ఈ సినిమాకోసం ప్రశాంత్ నీల్ రెగ్యులర్ టెక్నీషియన్స్ రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ సమకూర్చనున్నారు.
‘ఆర్.ఆర్.ఆర్‘తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్.. గత ఏడాది ‘దేవర‘తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘దేవర‘ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఈ ఏడాది ఆగస్టులో ‘వార్ 2‘తో రాబోతున్నాడు. ఇప్పటికే ‘వార్ 2‘ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకోగా.. ఇకపై తన పూర్తి ఫోకస్ అంతా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పైనే పెట్టనున్నాడు ఎన్టీఆర్.