ప్రదీప్ రంగనాథన్ డబుల్ ధమాకా!
‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించినా నటుడిగా బిజీ అయ్యాడు.;
‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించినా నటుడిగా బిజీ అయ్యాడు. ప్రస్తుతం ప్రదీప్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్యూడ్' సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాలూ ఒకే రోజున విడుదల తేదీలు ఖరారు చేసుకోవడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
నయనతార నిర్మాణంలో ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలకానుంది. 2040లో ఓ లవ్ స్టోరీ ఇతివృత్తంతో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా.. విలన్ గా ఎస్.జె.సూర్య కనిపించనున్నాడు. అనిరుధ్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
మరోవైపు దీపావళి కానుకగా అక్టోబర్ 17నే ఆడియన్స్ ముందుకు వస్తోంది ప్రదీప్ మరో చిత్రం 'డ్యూడ్'. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రదీప్ కి జోడీగా మమిత బైజు నటిస్తుంది. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన పాటకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. మొత్తంగా.. దీపావళి కానుకగా ఒకేరోజు రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ప్రదీప్ రంగనాథన్.