అభిమానికి అండగా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన వీరాభిమాని రాజేశ్వరి, సైకిల్‌పై హైదరాబాద్‌కు ప్రయాణించి తన అభిమానాన్ని చాటుకున్నారు.;

By :  S D R
Update: 2025-08-29 07:49 GMT

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన వీరాభిమాని రాజేశ్వరి, సైకిల్‌పై హైదరాబాద్‌కు ప్రయాణించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి ఆమెను ఆహ్వానించి, ఆత్మీయంగా కలుసుకున్నారు.

రాజేశ్వరి రాఖీ కట్టగా ఆశీర్వదించి, అందమైన చీరను బహుమతిగా అందించారు. అంతేకాకుండా, ఆమె పిల్లల విద్య కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. అభిమానులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి మహోన్నత మనసుకు ఇది మరో నిదర్శనం.

Tags:    

Similar News