లాంగ్ రన్ టైమ్ తో ‘మదరాసి’
రన్‌టైమ్ 167 నిమిషాలు. అంటే 2 గంటల 47 నిమిషాలు. ఇంత లాంగ్ రన్‌టైమ్‌తో స్క్రీన్‌ప్లే ఎలా ఉండనుంది అనేది ఆసక్తిగా మారింది.;
శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ 'మదరాసి' అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఈ దర్శకుడి రీసెంట్ ఫ్లాప్‌ల వల్ల అంచనాలు లో లెవెల్‌లో ఉన్నాయి. కానీ ఒక్క ట్రైలర్‌తో సీన్ మొత్తం మారిపోయింది. స్ట్రాంగ్ స్టోరీ, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్, అండ్ హార్ట్ టచ్చింగ్ లవ్ ట్రాక్‌తో ట్రైలర్ ఫుల్ జోష్ ఇచ్చింది.
'మధరాసి' సెప్టెంబర్ 5, 2025న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. సెన్సార్ ప్రక్రియ పూర్తయి, మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. రన్‌టైమ్ 167 నిమిషాలు. అంటే 2 గంటల 47 నిమిషాలు. ఇంత లాంగ్ రన్‌టైమ్‌తో స్క్రీన్‌ప్లే ఎలా ఉండనుంది అనేది ఆసక్తిగా మారింది. మురుగదాస్ దీన్ని ఎలా హ్యాండిల్ చేశారో అనేది కీలకం.
లాంగ్ మూవీస్‌లో స్క్రీన్‌ప్లే సూపర్ టైట్‌గా ఉండాలి. లేకపోతే స్లో మూమెంట్స్ వస్తే ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమ్వాల్ విలన్‌గా కనిపించనున్నారు. ఎన్. శ్రీలక్ష్మి ప్రసాద్ శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్‌తో ఫుల్ ఎనర్జీ ఇస్తున్నారు.