విశాల్ – ధన్సిక నిశ్చితార్థం

యాక్షన్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.;

By :  S D R
Update: 2025-08-29 07:27 GMT

యాక్షన్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ ప్రత్యేక సందర్భంలో విశాల్ తన అభిమానుల ప్రేమ, మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, కొత్త జీవన ప్రయాణంలోకి అడుగుపెడుతున్న సమయంలో వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు అందించాలని కోరాడు.

ఈరోజు విశాల్ పుట్టినరోజు కావడం మరో విశేషం. విశాల్ తన పుట్టినరోజునే తన పెళ్లికి నిశ్చితార్థం పూర్తి చేసుకోవడంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే విశాల్-ధన్సిక వివాహం జరగనుంది. ప్రస్తుతం విశాల్ తన 35వ చిత్రం ‘మకుటం‘తో బిజీగా ఉన్నాడు.

ఇక సాయి ధన్సిక తమిళనాడులోని తంజావూరులో 1990 నవంబర్ 20న జన్మించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ‘కబాలి‘ సినిమాలో ఆయన కుమార్తె పాత్ర ద్వారా విపరీతమైన గుర్తింపు పొందింది ధన్సిక. ఆ తర్వాత ‘షికారు, అంతిమ తీర్పు, దక్షిణ‘ వంటి తెలుగు చిత్రాలలోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.



Tags:    

Similar News