ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్‘
‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ లాంటి లవ్ స్టోరీస్ తో తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్.;
By : S D R
Update: 2025-05-10 09:18 GMT
‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ లాంటి లవ్ స్టోరీస్ తో తమిళ, తెలుగు భాషల్లో క్రేజీ హీరోగా మారాడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ మూడో చిత్రంగా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రెడీ అవుతుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతుంది.
ఇక ప్రదీప్ రంగనాథన్ నాల్గవ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీకి ‘డ్యూడ్‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ బైలింగ్వల్ మూవీలో ప్రదీప్ కి జోడీగా ‘ప్రేమలు‘ ఫేమ్ మమితా బైజు నటిస్తుంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.