సూపర్ స్టార్ సినిమాలో పూజా హెగ్డే ?

Update: 2025-02-20 14:27 GMT

అందాల హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల కోలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. సూర్యతో ‘రెట్రో’ , దళపతి విజయ్‌తో ‘జన నాయకన్’ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోంది. ఇక.. తాజాగా ఆమె సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం పూజా హెగ్డేని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్‌కు రొమాంటిక్ కోణం లేకుండా.. తన వయస్సుకు తగిన పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే, సినిమాకు గ్లామర్ టచ్ ఇచ్చేందుకు లోకేష్ ఐటమ్ సాంగ్‌ని చేర్చాలని భావిస్తున్నారని సమాచారం.

అయితే ఈ గీతంలో పూజా హెగ్డే నటిస్తారా లేదా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. పూజా హెగ్డేకి ఐటమ్ సాంగ్స్ కొత్తేమీ కాదు. వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్3’ సినిమాలో కూడా ఆమె ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఈ వార్తపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News