పవన్ బర్త్ డే ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ ట్రీట్ రెడీ అవుతుంది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సూపర్ హిట్ ‘తమ్ముడు‘ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది.;

By :  S D R
Update: 2025-08-09 13:10 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ ట్రీట్ రెడీ అవుతుంది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సూపర్ హిట్ ‘తమ్ముడు‘ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘తమ్ముడు‘ చిత్రానిది ప్రత్యేకమైన స్థానం. ‘తమ్ముడు‘ పవన్ కళ్యాణ్‌కు యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో కిక్ బాక్సర్ గా అదరగొట్టాడు పవర్ స్టార్.

1999లో విడుదలైన ఈ సినిమాకి పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమా కథను హిందీ చిత్రం ‘జో జీతా వోహి సికందర్‌‘ నుండి స్ఫూర్తి పొందినా, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేశాడు అరుణ్ ప్రసాద్. పవన్ కి జోడీగా ప్రీతి జింగానియా నటించింది. రమణ గోగుల సంగీతం ‘తమ్ముడు‘ విజయంలో మరో కీలక పాత్ర పోషించింది. మొత్తంగా.. ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా వస్తోన్న ‘తమ్ముడు‘ మళ్లీ థియేటర్లలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.



Tags:    

Similar News