క్రిష్ కి కృతఙ్ఞతలు తెలిపిన పవన్
'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దర్శకుడు క్రిష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు పవన్.;
By : S D R
Update: 2025-07-21 06:35 GMT
'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దర్శకుడు క్రిష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు పవన్. క్రిష్ మొదటిసారిగా ఈ ప్రాజెక్ట్‌ను తన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు తనకు ఎంతగానో నచ్చిందని.. అలా మొదలైన ఈ సినిమాకోసం ఎంతో కష్టపడ్డామన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తన దగ్గరకు తీసుకొచ్చిన క్రిష్ కి కృతఙ్ఞతలు తెలిపారు పవన్.
ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వడం వలన ఆయన వేరే ప్రాజెక్ట్ కి వెళ్లాల్సి వచ్చిందని.. ఆ తర్వాత జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని పవన్ అన్నారు. 'ఖుషి' సినిమా జరుగుతున్న సమయంలోనే జ్యోతికృష్ణ తెలుసని.. ఆయనలో మంచి టాలెంట్ ఉందని పవన్ అన్నారు. అలాగే.. ఈ ప్రాజెక్ట్‌కి మరో మెయిన్ పిల్లర్ సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు.