పాన్ ఇండియా మిషన్.. ప్రమోషన్స్ మిస్సింగ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మే 9న థియేటర్లలోకి వస్తుందని యూనిట్ వర్గాలు అంటున్నప్పటికీ, అభిమానులలో మాత్రం భిన్నమైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మే 9న థియేటర్లలోకి వస్తుందని యూనిట్ వర్గాలు అంటున్నప్పటికీ, అభిమానులలో మాత్రం భిన్నమైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. కారణం స్పష్టమే – ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాకపోవడం.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనేక వాయిదాలు చూసింది. పైగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. దీంతో ప్రచారాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్వహించాల్సి ఉంది. కానీ 'హరిహర వీరమల్లు' విషయంలో ఆ ఉత్సాహం కనిపించడంలేదు. వచ్చిన పోస్టర్లు, సాంగ్స్ సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.
ఇక మెయిన్ ఇష్యూ పవన్ కళ్యాణ్ డేట్స్. ప్రస్తుతం ఆయన రాజకీయంగా చాలా బిజీ. ఈనేపథ్యంలో ఆయనకు డేట్స్ ఇవ్వడం కష్టంగా మారుతుంది. మే 9 వరకూ నెల రోజులే మిగిలి ఉండగా, అన్ని భాషల్లో రిలీజ్ కావాలంటే ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రచారం చేయాల్సిందే. అయితే పవన్ అందుబాటులో లేకపోతే, మిగతా టీమ్ లో బాబీ డియోల్, నిధి అగర్వాల్ వంటి వారితో ప్రచారం చేయించాల్సి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో సినిమాకు మరో వాయిదా వేయాల్సి వస్తే, అది సినిమా క్రేజ్ పై భారీ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి యూనిట్ ఇప్పటికైనా ప్రచార యుద్ధానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.