ఒరిజినల్ ‘డాన్‘ డైరెక్టర్ మృతి

ప్రముఖ హిందీ దర్శకుడు చంద్రా బరోట్ ఈరోజు (జూలై 20) ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో కన్నుమూశారు.;

By :  S D R
Update: 2025-07-20 10:09 GMT

ప్రముఖ హిందీ దర్శకుడు చంద్రా బరోట్ ఈరోజు (జూలై 20) ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వయోభారంతో పాటు గత ఏడు సంవత్సరాలుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఈ వార్తను ఆయన భార్య దీపా బరోట్ మీడియాకు తెలిపారు.

టాంజానియాలో జన్మించిన చంద్రా బరోట్, భారతదేశానికి వచ్చి సినీ పరిశ్రమలో మేజర్ దర్శకుడు మనోజ్ కుమార్‌కు అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘శోర్’, ‘రోటి కప్డా ఔర్ మకాన్’ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1978లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘డాన్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, బాలీవుడ్‌కి ఒక శాశ్వత బ్రాండ్‌ను అందించారు.

‘డాన్‘ సినిమా బాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ స్టార్‌డమ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రాన్ని అప్పట్లో తెలుగులో యన్టీఆర్ ‘యుగంధర్‘గా, రజనీకాంత్ ‘బిల్లా‘గా రీమేక్ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత అదే స్టోరీతో హిందీలో షారుక్ ఖాన్ ‘డాన్‘ పేరుతోనూ.. తమిళంలో అజిత్ ‘బిల్లా‘ పేరుతో, తెలుగులో ప్రభాస్ ‘బిల్లా‘గానూ రీమేక్ చేయడం విశేషం. అన్ని భాషల్లోనూ ‘డాన్‘ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

Tags:    

Similar News