ఒక హీరో.. ఐదు సీక్వెల్స్!
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. ఇప్పటికే ఒక సినిమా సూపర్ హిట్ సాధించిన ప్రాజెక్ట్స్ విషయంలో వాటి సీక్వెల్స్ పై ఉండే క్రేజ్ మామూలుగా లేదు.;
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. ఇప్పటికే ఒక సినిమా సూపర్ హిట్ సాధించిన ప్రాజెక్ట్స్ విషయంలో వాటి సీక్వెల్స్ పై ఉండే క్రేజ్ మామూలుగా లేదు. తెలుగులో ఎక్కువగా సీక్వెల్స్ ను లైన్లో పెట్టిన హీరోగా ప్రభాస్ ఉంటే.. తమిళంలో కార్తీ వరుస సీక్వెల్స్ తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.
కథల ఎంపికలో ఎప్పుడూ విలక్షణంగా దూసుకెళ్లే కార్తీ నుంచి ఇప్పుడు వరుస సీక్వెల్స్ రాబోతున్నాయి. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘సర్దార్ 2‘. ఇప్పటికే సూపర్ హిట్టైన ‘సర్దార్‘ చిత్రానికి సీక్వెల్ గా ‘సర్దార్ 2‘ రెడీ అవుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.
కార్తీ నుంచి రాబోయే మరో రెండు సూపర్ హిట్ సీక్వెల్స్ ‘ఖైదీ 2, ఖాకీ 2‘. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ లో ముందుగా వచ్చిన చిత్రం ‘ఖైదీ‘. ఈ సినిమా సీక్వె ల్ కోసం చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. లోకేష్ కనకరాజ్ ‘కూలీ‘ పూర్తైన తర్వాతే ‘ఖైదీ 2‘ పట్టాలెక్కనున్నట్టు కోలీవుడ్ టాక్.
కార్తీ నటించిన కాప్ స్టోరీస్ లో ‘ఖాకీ‘ది ప్రత్యేకమైన స్థానం. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ట్రీట్ అందించింది. ప్రస్తుతం విజయ్ తో ‘జన నాయగన్‘ చేస్తున్న వినోద్.. ఆ తర్వాత చేపట్టేది ‘ఖైదీ 2‘ ప్రాజెక్ట్ అనే ప్రచారం ఉంది.
మరోవైపు కార్తీ హీరోగా నటించకపోయినా.. అతనితోనే తయారయ్యే సీక్వెల్స్ కూడా ఉన్నాయి. వీటిలో ‘హిట్ 4‘ ఒకటి. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ హిట్ సిరీస్ లోని ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ లో కార్తీ కథానాయకుడిగా నటించనున్నాడనేది ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
అసలు కార్తీ చేయాల్సిన సీక్వెల్స్ లిస్టులో ‘కంగువా 2‘ కూడా ఉంది. ‘కంగువా‘లో భయంకరమైన గెటప్ లో కనిపించి సీక్వెల్ లో తాను ఉండబోతున్నానని హింట్ ఇచ్చాడు కార్తీ. కానీ.. ‘కంగువా‘ ఘోరంగా పరాజయం పాలవ్వడంతో సీక్వెల్ ఉండే అవకాశాలు దాదాపు లేనట్టే.