స్టార్ హీరోలు అవసరం లేదు.. శివాజీరాజా!

కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలకూ మంచి విజయాలు సాధ్యమని ప్రముఖ నటుడు శివాజీ రాజా అన్నారు. లేటెస్ట్ గా 'వైల్డ్ బ్రీత్' మూవీ ఫస్ట్ లుక్‌ను ఆయన విడుదల చేశారు.;

By :  S D R
Update: 2025-06-14 01:36 GMT

కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలకూ మంచి విజయాలు సాధ్యమని ప్రముఖ నటుడు శివాజీ రాజా అన్నారు. లేటెస్ట్ గా 'వైల్డ్ బ్రీత్' మూవీ ఫస్ట్ లుక్‌ను ఆయన విడుదల చేశారు. 'రేవు' వంటి సినిమాను నిర్మించిన సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ నుంచి ఈ చిత్రం వస్తోంది. హరినాథ్ పులి దర్శకత్వంలో పర్వతనేని రాంబాబు, డా. మురళీచంద్ గింజుపల్లి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ ఫిలించాంబర్‌లో జరిగిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు శివాజీ రాజాతో పాటు నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, పలు మీడియా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ, కథ బలంగా ఉంటే స్టార్ హీరోలు అవసరం లేదని, ‘వైల్డ్ బ్రీత్’ టైటిల్, ఫస్ట్ లుక్ బాగా నచ్చాయన్నారు. పర్వతనేని రాంబాబు నిర్మాతగా మరిన్ని విజయవంతమైన సినిమాలు చేయాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News