ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ‘కన్నప్ప‘!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘ ప్రమోషన్స్ పీక్స్ కు చేరాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ వచ్చేసింది.;

By :  S D R
Update: 2025-06-14 13:21 GMT

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘ ప్రమోషన్స్ పీక్స్ కు చేరాయి. శివ భక్తుడు కన్నప్ప కథతో ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్ మెంట్స్ పై మోహన్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ వచ్చేసింది.

దేవుడు అంటే నమ్మకం లేని తిన్నడు.. శివ భక్తుడిగా ఎలా మారాడు? ఆ క్రమంలో జరిగిన పరిణామాలు ఏంటి? అనే పౌరాణిక కథను విజువల్ ట్రీట్ గా అందించే ప్రయత్నం ‘కన్నప్ప‘లో జరిగినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. శివుడిగా అక్షయ్ కుమార్, రుద్ర పాత్రలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్ లో ఆకట్టుకుంటుంది.

ఇంకా మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి తారాగణం పోషించిన పాత్రలపైనా ఈ ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. మొత్తంగా.. ట్రైలర్ తో ‘కన్నప్ప‘పై అంచనాలు భారీగా పెరిగాయనే చెప్పాలి. జూన్ 27న పాన్ ఇండియా లెవెల్ లో ‘కన్నప్ప‘ విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News