అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డులు

హైదరాబాద్‌ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024 వేడుక వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు.;

By :  S D R
Update: 2025-06-14 17:33 GMT

హైదరాబాద్‌ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024 వేడుక వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, సుకుమార్, మణిరత్నం, జయప్రద, జయసుధ, సుహాసిని వంటి సినీ ప్రముఖుల హాజరు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజేతలకు మెమెంటోతో పాటు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేశారు.

అవార్డులు జాబితా

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌

ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్‌

ప్రథమ ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ

ద్వితీయ ఉత్తమ చిత్రం: పొట్టేల్‌

తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు

ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్‌: మేం ఫ్రెండ్సండీ

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్‌ శ్రీరామ్‌: ఊరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)

ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్‌: పుష్ప2 (సూసేకి అగ్గిరవ్వ మాదిరి..) (హాజరు కాలేదు)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేష్‌ ఆచార్య (దేవర-ఆయుధపూజ)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)

ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్‌ (మత్తు వదలరా2)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)

ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: అధ్నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌కుమార్‌ (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)

ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి)

ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: అరుణ్‌ దేవ్‌ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్‌)

ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కమ్యూనల్‌ హార్మోనీ సోషల్‌ అప్లిస్ట్‌: కమిటీ కుర్రాళ్లు

ఉత్తమ చారిత్రక చిత్రం :రజాకార్‌

స్పెషల్‌ జ్యూరీ: దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

స్పెషల్‌ జ్యూరీ: అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

స్పెషల్‌ జ్యూరీ: సుజిత్‌, సందీప్‌ (క)

స్పెషల్‌ జ్యూరీ: ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ (రాజు యాదవ్‌)

జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌ : ఫరియా అబ్దుల్లా (మత్తువదలరా)

ఉత్తమ తొలి చిత్రం: యదు వంశీ (కమిటీ కుర్రాళ్లు)

సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే..

2014

ప్రథమ ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌

రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల

మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను

2015

ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి

రెండో ఉత్తమ చిత్రం: కంచె

మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు

2016

ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి

రెండో ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు

మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్‌

2017

ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2

రెండో ఉత్తమ చిత్రం: ఫిదా

మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ

2018

ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి

రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం

మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్‌ కంచరపాలెం

2019

ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి

రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ

మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం

2020

ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..

రెండో ఉత్తమ చిత్రం: కలర్‌ ఫొటో

మూడో ఉత్తమ చిత్రం: మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌

2021

ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్‌

రెండో ఉత్తమ చిత్రం: అఖండ

మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన

2022

ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం

రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2

మూడో ఉత్తమ చిత్రం: మేజర్‌

2023

ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం

రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్‌

మూడో ఉత్తమ చిత్రం: భగవంత్‌ కేసరి

స్పెషల్‌ అవార్డ్స్‌

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ

పైడి జైరాజ్‌ అవార్డు: మణిరత్నం

బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు: సుకుమార్‌

నాగిరెడ్డి అండ్‌ చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు: అట్లూరి పూర్ణ చంద్రరావు

కాంతారావు ఫిల్మ్‌ అవార్డు: విజయ్‌ దేవరకొండ

రఘుపతి వెంకయ్య అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్‌

Tags:    

Similar News