ఆర్చరీ క్రీడాకారుడిగా నితిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో వస్తోన్న నితిన్ చిత్రం ‘తమ్ముడు‘. ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్, రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో వస్తోన్న నితిన్ చిత్రం ‘తమ్ముడు‘. ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్, రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలకు ముస్తాబవుతోన్న ‘తమ్ముడు‘ మూవీ నుంచి క్యారెక్టర్స్ ను పరిచేయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది టీమ్.
ఈ సినిమాలో సప్తమి గౌడ - రత్న పాత్రలో కనిపించబోతుండగా, మరో ఇద్దరు హీరోయిన్లు స్వసిక - గుత్తి అనే క్యారెక్టర్ లో, వర్ష బొల్లమ్మ - చిత్ర క్యారెక్టర్ లోనూ కనిపించబోతున్నారు. ‘తమ్ముడు‘తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్న లయ - ఝాన్సీ కిరణ్మయి అనే క్యారెక్టర్ లో కనిపించబోతుండగా.. నితిన్ - జే క్యారెక్టర్ లో ఇండియా తరపు ఆర్చరీ క్రీడాకారుడిగా అలరించబోతున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు‘ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందితే.. ఇప్పుడు నితిన్ ‘తమ్ముడు‘ రా అండ్ రస్టిగ్ గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా.. ‘రాబిన్ హుడ్‘ నిరాశపరచడంతో ఇప్పుడు ‘తమ్ముడు‘తో మంచి విజయాన్ని అందుకోవాలనే ఆశతో ఉన్నాడు యూత్ స్టార్ నితిన్.