మా అమ్మ క్షేమంగానే వున్నారు: మెగాస్టార్ చిరంజీవి
By : Surendra Nalamati
Update: 2025-02-21 19:21 GMT
మెగాస్టార్ చిరంజీికి గారి మాతృమూర్తి అయిన అంజనమ్మ గారు అస్వస్థతకు గురి అయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అని వస్తున్న వార్తల పై మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దయచేసి నమ్మవద్దు అని ఆయన ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం అంజనమ్మ గారు అస్వస్థకు గురి అవ్వడం నిజమే, కానీ ఇప్పుడు ఆవిడ బాగానే ఉన్నారు అని ఆయన తెలిపారు.దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న ఈ తప్పుడు వార్తను అందరూ గుర్తించాల్సిందిగా ఆయన కోరారు. అంజనమ్మ గారు ఇప్పుడు కోరుకున్నారని, ఆవిడ బాగానే ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లు పోస్ట్ చేశారు. అలానే మా అమ్మగారి ఆరోగ్యం పట్ల మీడియా ఎలాంటి ప్రచారం చేయవద్దని, ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు.