గ్రాండ్‌గా అఖిల్ రిసెప్షన్!

అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనబ్ రవడ్జీతో వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. జూన్ 6న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.;

By :  S D R
Update: 2025-06-08 16:51 GMT

అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనబ్ రవడ్జీతో వివాహ బంధంతో ఒక్కటయ్యాడు. జూన్ 6న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హీరోలు మహేష్ బాబు, సూర్య, వంటి ప్రముఖులు ఈ వేడుకలో మెరిశారు. అఖిల్-జైనబ్‌ను ఆశీర్వదించారు. ఇంకా ఈ రిసెప్షన్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేయబోతున్నారు.

Tags:    

Similar News