వింటేజ్ పవర్ స్టార్ రీ ఎంట్రీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, రాజకీయాల మధ్య సమతుల్యం పాటిస్తూ, అభిమానులకు వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, రాజకీయాల మధ్య సమతుల్యం పాటిస్తూ, అభిమానులకు వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాడు. ఇప్పటికే 'హరి హర వీరమల్లు' షూటింగ్ పూర్తి చేసిన పవన్.. లేటెస్ట్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ ఫిల్మ్ ‘ఓజీ’ను సైతం కంప్లీట్ చేశాడు.
ఈ సినిమా హైదరాబాద్ తో పాటు, ముంబై, ఇంకా తాడేపల్లిలో వేసిన స్పెషల్ సెట్స్ లో కీలక భాగాల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మేకర్స్ ఇటీవల ప్రకటించినట్టుగా, పవన్ కళ్యాణ్ నటించిన భాగం మొత్తం పూర్తి కాగా, ఇంకా కొంతమేరకు షూటింగ్ పెండింగ్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ తాజాగా విజయవాడలో ఓ సెలూన్ ఓపెనింగ్‌కి హాజరై కొత్త లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. వైట్ అండ్ వైట్ స్టైల్‌ను పక్కన పెట్టి, స్కై బ్లూ టీ-షర్ట్, బ్లాక్ షార్ట్స్, స్నీకర్స్‌లో వింటేజ్ పవన్ లుక్‌ను గుర్తు చేస్తూ సందడి చేశాడు. చాలా కాలం తర్వాత పవన్ స్టైలిష్ గెటప్‌లో దర్శనమివ్వడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.
రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత, పవన్ ఫిట్‌నెస్‌పై విమర్శలు వచ్చినా – ఇటీవల షూటింగులలో యాక్టివ్‌గా పాల్గొంటూ తిరిగి యంగ్ లుక్‌కు షిప్ట్ అవడం చూస్తూనే ఉన్నాము. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్లీ ఆయన సినిమాలు, లుక్స్, లైన్ అప్ చూసి ఖుషీ అవుతున్నారు. మొత్తంగా.. ఈ ఏడాది ద్వితియార్థంలో 'హరి హర వీరమల్లు, ఓజీ' రూపంలో పవన్ కళ్యాణ్ రెండు మేజర్ మూవీస్ తో ఆడియన్స్ కు ట్రీట్ ఇవ్వబోతున్నాడు.