ఆసక్తి రేపుతున్న మేఘాల ప్రేమకథ!
పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పరిచే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ఒకటి.;

పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పరిచే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ఒకటి. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విపిన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో సుమన్, ఆమని, తులసి, విద్యుల్లేఖ, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
సునేత్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ టీజర్ రాగా.. ఇప్పుడు సెకండ్ టీజర్ పేరుతో మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు. టీజర్-2లో హీరో, హీరోయిన్ల ప్రేమకథను మరింత ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. చాన్నాళ్ల తర్వాత తెలుగులో ఓ మంచి ప్రేమకథను చూడబోతున్నామనే వైబ్ ను 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' టీజర్ అందిస్తుంది. త్వరలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.