‘వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుకపై హైప్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జూలై 24న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది.;

By :  S D R
Update: 2025-07-14 01:28 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. జూలై 24న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయడానికి సన్నద్ధమవుతుంది టీమ్. ఈకోవలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ముందుగా తిరుపతిలో ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఇప్పుడు వైజాగ్ కి షిప్ట్ అయినట్టు తెలుస్తోంది. జూలై 20న విశాఖపట్నంలో సముద్రతీరాన భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలిసారి నటించిన చారిత్రక కథాంశ చిత్రమిది. ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించింది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, సునీల్, నోరా ఫతేహి, అనసూయ వంట వారు కీలక పాత్రలు పోషించారు. ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

Tags:    

Similar News