చిరుతో మౌనీ స్టెప్స్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. UV క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉంది.;
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. UV క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా త్రిష నటిస్తుంటే.. కీలక పాత్రల్లో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, స్పెషల్ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియోని అప్రోచ్ అయ్యారట. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఈ స్పెషల్ సాంగ్ లో చిరుతో స్టెప్స్ వేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నా.. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు.. పలు నేషనల్, ఇంటర్నేషనల్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు కలిసి అత్యున్నత ప్రమాణాల్లో ‘విశ్వంభర‘ కోసం విజువల్స్ రెడీ చేస్తున్నాయట. ఐటమ్ సాంగ్ షూటింగ్, ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి ‘విశ్వంభర‘ రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.