మమ్ముట్టిని చుట్టుముట్టిన అపోహలు... టీమ్ క్లారిటీ !

73 ఏళ్ల ఈ స్టార్‌ హీరో క్యాన్సర్‌కు గురయ్యారని, సినిమా షూటింగ్‌ నుంచి విరామం తీసుకున్నారని పలు వార్తలు వినిపించాయి.;

By :  K R K
Update: 2025-03-17 01:56 GMT

మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మమ్ముట్టికి సంబంధించి కొన్ని అపోహలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. 73 ఏళ్ల ఈ స్టార్‌ హీరో క్యాన్సర్‌కు గురయ్యారని, సినిమా షూటింగ్‌ నుంచి విరామం తీసుకున్నారని పలు వార్తలు వినిపించాయి. అయితే, మమ్ముట్టి టీమ్ ఈ వార్తలను ఖండించింది. మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు ముగింపు పలుకుతూ.. ఆయన టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘అది పూర్తిగా ఫేక్ న్యూస్. మమ్ముట్టి ప్రస్తుతం రంజాన్ కారణంగా ఉపవాసం చేస్తూ సెలవులో ఉన్నారు. అందువల్లే షూటింగ్‌కి విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మోహన్‌లాల్‌తో కలిసి మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి తిరిగి చేరనున్నారు’... అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

మహేశ్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా శ్రీలంకలో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఎంఎంఎంఎన్ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ మళ్లీ ఒకే తెరపై కనిపించనుండటం విశేషం. వీరిద్దరితో పాటు ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల, మమ్ముట్టి తన తాజా చిత్రం "బజూకా" పోస్టర్‌ను విడుదల చేశారు. 2023లో అనౌన్స్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రాన్ని దీను డెన్నిస్ డైరెక్ట్ చేస్తున్నారు. పలు కారణాల వల్ల ఆలస్యమైన ఈ మూవీ ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది. గౌతమ్ వాసుదేవ్ మేనన్, బాబు ఆంటోని, ఐశ్వర్యా మేనన్, నీతా పిళ్లై, గాయత్రి అయ్యర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News