ఓటీటీ లోకి వచ్చేసిన ‘మిస్టర్ అండ్ మిస్సెస్ బ్యాచిలర్’
.‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’. ఈ మూవీ మే 23, 2025న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఒక నెలకు పైగా సమయం గడిచిన తర్వాత.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.;
ఇంద్రజిత్ సుకుమారన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం....‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’. ఈ మూవీ మే 23, 2025న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఒక నెలకు పైగా సమయం గడిచిన తర్వాత.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.
‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ మూవీ ఇప్పుడు మనోరమా మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని మనోరమా మ్యాక్స్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ ... ఇప్పుడు మనోరమా మ్యాక్స్‌లో చూడండి... అని నిర్మాతలు పోస్ట్ చేశారు.
ఈ సినిమా స్టెఫీ అనే యువతి కథ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన పెళ్లి నుండి తప్పించుకుని పారిపోతుంది మరియు 40 ఏళ్ల బ్యాచిలర్ సిద్ధుని కలుస్తుంది. ఈ ఇద్దరి హాస్యభరితమైన, సాహసోపేతమైన ప్రయాణం మరియు స్టెఫీ తన వివాహం నుండి ఎందుకు తప్పించుకుందనే కారణాలు సినిమా కథలో ఆసక్తి గా ఉంటాయి.
ఈ సినిమాలో ఇంకా దయ్యానా హమీద్, రోసిన్ జోలీ, బిజు పప్పన్, రాహుల్ మాధవ్, జాన్ జాకబ్, సోహన్ సీనులాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హైలైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాశ్ హైలైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపు కరుణాకరన్ దర్శకత్వం వహించగా, అర్జున్ టి. సత్యన్ స్క్రీన్‌ప్లే రాశారు. సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పిఎస్ జయహరి సమకూర్చారు.