ఫ్లూటో మలయాళం సినిమా ప్రారంభం
‘ప్లూటో’ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు. అప్పట్లో షమల్ చాకో దర్శకుడిగా ఉన్నారు. తాజాగా సినిమా ను ప్రారంభించారు.;
మలీవుడ్ టాలెంటెడ్ నటుడు నీరజ్ మాధవ్, యువ నటదర్శకుడు అల్తాఫ్ సలీమ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ప్లూటో’.. కొచ్చిలో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సినిమా బృందం, నటీనటులు పాల్గొన్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రాన్ని నియాస్ ముహమ్మద్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజు వర్గీస్, ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ ఫేమ్ ఆర్షా చాందిని బైజు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
‘ప్లూటో’ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు. అప్పట్లో షమల్ చాకో దర్శకుడిగా ఉన్నారు. అలాగే.. నీరజ్, అల్తాఫ్‌లతో ఒక టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో అల్తాఫ్ ఏలియన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. అప్పట్లో నియాస్ రచయిత మరియు క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు ‘ఎంగిలుమ్ చంద్రికే’ దర్శకుడు ఆదిత్యన్ చంద్రశేఖర్ క్రియేటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సాంకేతికంగా, ఈ సినిమాకు శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ, సనత్ శివరాజ్ ఎడిటింగ్, ఆశ్విన్ ఆర్యన్, ఆర్కాడో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రేజు కుమార్, రెస్మి రేజు ఒర్చిడ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు, జయకృష్ణన్ ఆర్‌కె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
నీరజ్ మాధవ్ ఇటీవల ‘లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్’ అనే జియో హాట్ స్టార్ వెబ్ సిరీస్‌లో గౌరి జి కిషన్, అజు వర్గీస్‌తో కలిసి నటించారు. మరోవైపు, అల్తాఫ్ తన రెండో దర్శకత్వ చిత్రం ‘ఓడుమ్ కుతిర చాడుమ్ కుతిర’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఓణం పండుగ సందర్భంగా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.